- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తుది దశ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేయనుంది. ప్రతి నియోజకవర్గంలో అగ్ర నేతల పర్యటన ఉండేలా షెడ్యూల్ రూపొందించింది. సమయం తక్కువగా ఉండడంతో ఏకంగా ఆరు హెలికాప్టర్లతో రాష్ట్రాన్ని చుట్టేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఏఐసిసి అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, డికె శివకుమార్ తదితర నేతలంతా ఈ హెలికాప్టర్లతో అన్ని నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
- Advertisement -