Wednesday, January 8, 2025

10 లక్షల మందితో జన జాతర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న తుక్కుగూడ సభను విజయవంతం చేయడానికి సిఎం రేవం త్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. నేడు సాయంత్రం తు క్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా ఎప్పటికప్పుడు పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమన్వయం చేసుకుం టూ వారికి దిశానిర్ధేశం చేస్తున్నారు. జన జాతర పే రుతో నిర్వహిస్తున్న ఈ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీ య మేనిఫెస్టోను ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఈసారి ఏఐసిసి పాంచ్ న్యా య్ పచ్చిస్ గ్యారంటీ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఈ సభతో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాం గ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టనుంది.

ఇప్పటికే సిఎం రేవం త్ రెడ్డి రెండు సార్లు సభా స్థలికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించగా, ప్రతిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద యం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి పనులను ప ర్యవేక్షిస్తున్నారు. సుమారు 10 లక్షల మంది జనాల ను సమీకరించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అందులో ప్రధానంగా లక్షమంది మహిళలను వేదిక ముందు వరసలో కూర్చోబెట్టి, అమలవుతున్న ఆరు పథకాలకు ధన్యవాదాలు చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు 10 లక్షల మంది జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించగా దానికోసం 70 ఎకరాల్లో సభ ప్రాంగణం, 550 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ముందు ఇ దే ప్రాంగణంలో సభ  నిర్వహించి ఆరు గ్యారంటీలు అప్పట్లో సోనియా గాంధీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే సెంటిమెంట్‌తో ఈ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది.

మండల, పార్లమెంటరీ స్థాయి నేతలతో సమన్వయం
రాష్ట్రంలో 14 లోక్ సభ సీట్లలో గెలుపే లక్ష్యంగా సిఎం రేవంత్ రెడ్డి వ్యూహారచన చేస్తున్నారు. గెలుపు కోసం మండల స్థాయి మొదలు పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పట్టు సాధించి పార్టీ అధిష్టానానికి మరో మారు తన సత్తా చూపాలని సిఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారు.
పార్టీని, పాలనను సమన్వయం చేస్తున్న సిఎం
పార్టీని, పాలనను సమన్వయం చేసుకుంటున్న సిఎం రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా లోక్ సభ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. లోక్‌సభ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇంటి నుంచే తన పని కానిచ్చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి, కరెంటు కోతలు ఉండకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరో వైపు తన నివాసాన్ని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ ఎంపి కేకే, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు ప్రస్తుత వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను తన నివాసంలోనే పార్టీలో చేర్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలాబలాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని దానికి అనుగుణంగా సిఎం రేవంత్‌రెడ్డి కార్యాచరణకు దిగుతున్నారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లోని కీలక నేతలకు ప్రభుత్వ సలహాదారు, పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి ద్వారా రాయబారం పంపుతున్నారు. వారితో చర్చలు జరిపాక తన నివాసానికి పిలిచి పార్టీలో చేర్చుకుంటున్నారు.

వేదిక ముందు లక్ష మంది మహిళలు కూర్చునేలా
తాము అధికారంలోకి వచ్చిన తరువాత అమలవుతున్న ఆరుపథకాలతో మహిళలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ ప్రభావం తుక్కుగూడ సభలో ప్రతిబింబించే తీరుగా మహిళలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పథకం అమలు వల్ల మహిళల్లో నెలకొన్న ఉత్సాహాన్ని ఏఐసిసి నేత రాహుల్ గాంధీకి కనిపించే విధంగా సభా వేదిక ముందు లక్ష మంది మహిళలను కూర్చోబెట్టేందుకు పిసిసి ప్రణాళికలను రూపొందించింది. హైదరాబాద్ సమీప జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో మహిళలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది. ఇప్పటివరకు అమలు చేస్తున్న పథకాల ప్రచారాన్ని ఆ ప్రాంగణంలో కనిపించేవిధంగా కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి జనజాతర సభ విపక్షాలు చర్చించుకునే విధంగా నిర్వహించాలని కాంగ్రెస్ లీడర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News