Monday, January 20, 2025

ఈశాన్యాన్ని కాంగ్రెస్ ఎటిఎంలా వాడుకుంది

- Advertisement -
- Advertisement -

షిల్లాంగ్ : ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఒక ఎటిఎంలా వాడుకుందని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. బిజెపి మాత్రం ఈ ప్రాంతాన్ని అష్టలక్ష్మిలా చూస్తోందన్నారు. కమలం వికసిస్తుందని ప్రజలు చెబుతుంటే, కాంగ్రెస్ మాత్రం తన సమాధి నిర్మాణం జరుగుతుందని నినాదాలు చేస్తోందన్నారు. శుక్రవారం మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా షిల్లాంగ్-లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు. ‘మీ ప్రజలను మీరు నమ్మకపోతే దేశాన్ని పాలించలేరు. వారి సమస్యలను గౌరవించి పరిష్కరించాలి. మొదట్లో ఈశాన్య భారతంలో వేర్పాటు రాజకీయాలు జరిగేవి. మేము వాటిని పాలన ఆధారంగా జరిగేలా నిర్ణయించాం. బిజెపి మతం లేదా ప్రాంతం ఆధారంగా ప్రజలపై వివక్ష చూపదు. ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఎటిఎం మిషన్‌లా వాడుకుంది’ అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి కోసం 1958 ఆర్మ్‌డు ఫోర్సెస్ చట్టాన్ని తొలగించిన విషయాన్ని మోడీ వెల్లడించారు.

మేఘాలయలో అంతటా బిజెపి ఉంది.. మీ కమలం వికసిస్తుంది’ అని ప్రజలు చెబుతుంటే, ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు మాత్రం మోడీ, నీ సమాధి నిర్మాణం జరుగుతుంది’ అని అంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉండేదని ప్రధాని అన్నారు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారత్‌ను పాలించేవారని, ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఉండేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధికి కేటాయించిన నిధులను కాంగ్రెస్ హయాంలో మళ్లించేవారని విమర్శించారు. కానీ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు మాత్రం ఈ రాష్ట్రానికి శాంతి, పురోగతి, శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తోందని మోడీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News