Thursday, January 23, 2025

రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ విజయం

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్ : రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మరో ఆరు నెలలు ఓపిక పట్టండి గూడు కల్పిస్తామని గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులతో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని పోతారం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ అధికారంలోకి రాగానే నేరవేర్చబోయే హమీలను ప్రజలకు వివరించారు. గ్రామ శివారులో ప్రాజెక్టు నిర్వాసితులు ఏర్పాటు చేసుకున్న నివాస ప్రాంతాన్ని సందర్శించి పరిహారం చెల్లింపులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టి అధికారంలోకి రాగానే ఇంటి స్ధలం కలిగిన వారు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు అందజేస్తామని వెల్లడించారు.

అనంతరం బొమ్మగాని యాదగిరి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో యువకులు, నాయకులను పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొల్లి శెట్టి శివయ్య, మండల అద్యక్షులు ఒంక చందు, పోతుగంటి బాలయ్య, ముత్యాల సంజీవరెడ్డి, బద్దం రాజిరెడ్డి, వల్లపు రాజు, పున్నసది, చిత్తారి రవీందర్, జంగపల్లి ఐలయ్య, గుర్రాల లింగారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, విద్యాసాగర్, వెన్నరాజు, బోమ్మగాని హరిబాబు, బొంగని శ్రీనివాస్‌గౌడ్, ఆలేటి జగ్గారెడ్డి, తిరుపతిరెడ్డి, నరసింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News