Wednesday, January 22, 2025

2004లోనే ఉచిత విద్యుత్ అందించిన పార్టీ కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

బెల్లంపల్లి: 2004లోనే 9 గంటల ఉచిత విద్యుత్ అందించిన పార్టీ కాంగ్రెస్ అని టిపిసిసి రేవంత్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభలో రేవంత్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి ప్రాజెక్టులు ఎంత వరదొచ్చినా తట్టుకుని నిలబడ్డాయని ఆయన పేర్కొన్నారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు 50 ఏళ్లుగా వరదలకు తట్టుకుని నిలబడ్డాయన్నారు. కెసిఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చీ రాగానే కుంగిపోయిందని రేవంత్ ఆరోపించారు.

తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత అత్యంత వెనకబడిన జిల్లా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ అని రేవంత్ ఆరోపించారు. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ పనులు ప్రారంభించిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వరకు మార్చారని చెప్పారు. 38 వేల 500 కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరాన్ని లక్షా 51 వేల కోట్లకు పెంచారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News