Monday, December 23, 2024

ధర్మపురిలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

ధర్మపురి: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాప్ లో 9 వస్తువులు వచ్చేదని, ధర్మపురిలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈవీఎంలు మార్చి ధర్మపురిలో బిఆర్ఎస్ గెలిచిందన్నారు. అట్లూరి లక్ష్మణ్ ను ఓడించడానికి కెసిఆర్ కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. ధర్మపురిలో గెలిచిన అభ్యర్థి మీ ప్రాంతానికి ఏమైనా చేశారా?.. ధర్మపురి నియోజకవర్గానికి ఏమీ చేయని ఈశ్వర్ మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారు..? అని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ పాలనలో రేషన్ షాపులో బియ్యం తప్ప ఏమీ రావట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు రావాలన్న, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు రావాలన్న, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్ వేస్తామని ఆయన వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News