Wednesday, January 22, 2025

మోడీ వేవ్ కు కాంగ్రెస్ చెక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 40.10 శాతానికి పెరిగినా సీ ట్లు మాత్రం ఎనిమిదే వచ్చాయి. హోరాహోరీగా త్రిముఖంగా జరిగిన పోటీలో బిఆర్‌ఎస్ పార్టీ ఓ ట్లలో దాదాపు 17 శాతం ఓట్లు బిజెపికి క్రాస్ కా వ డంతో ఆ పార్టీ 35.08 ఓట్ల శాతంతో అధికార కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది సీట్లు గెలుచుకోగలిగింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పార్టీల వారీగా ఓట్ల శాతాన్ని విశ్లేషిస్తే ఆశ్చర్యకరంగా ఫ లితాలు వచ్చాయని వెల్లడైంది. అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పైచేయి సాధించలేకపో యినా కర్నాటకతో పోలిస్తే మోడీ వేవ్‌ను కట్టడి చేయగలిగింది. కర్నాటకలో ఎన్‌డిఎ కూటమి 18 సీట్లు గె లువగా, ‘ఇండియా’ కూటమి 10 సీట్లే గెలిచింది. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దక్షిణాదిన మోడీ వేవ్‌ను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టగలిగింది.

బిఆర్‌ఎస్ లోక్‌సభలో జీరోగా మిగలగా, ఆ ఓట్లతో బిజెపి గతం కన్నా నాలుగు సీట్లను అదనంగా సాధించగలిగింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌కు 39.40 శాతం ఓట్లు రాగా, ఆ ఎన్నికల్లో ప్రధాన విపక్షంగా మారిన బిఆర్‌ఎస్‌కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. కాని లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి బిఆర్‌ఎస్ ఓట్ల శాతం 16.68కి తగ్గిపోయింది. అంటే దాదాపు గా 21 శాతం ఓట్లు ఆ పార్టీకి తగ్గాయి. ఇందులో అసెం బ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లే సాధించిన బిజెపి బిఆర్‌ఎస్ నుంచి తగ్గిన 21 శాతంతో పాటు అదనంగా మరో ఒక్క శాతం ఓటుతో 35.08 ఓట్లను సాధించింది. ఒకే ఒక్క సీటును సాధించిన ఎం ఐఎం 3.0 ఓట్లను సాధించగలిగింది. మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ ఓట్ల శాతం పెంచుకున్నా సీట్లను గణనీయంగా పెంచుకోలేకపోయింది. అలాగే దాదాపు అసెంబ్లీ ఫలితాల కన్నా 22 శాతం ఓట్లు పెంచుకున్న బిజెపి కూడా కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది సీట్ల దగ్గరే ఆగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News