Sunday, July 7, 2024

తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి నువ్వానేనా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సార్వత్రిక ఫలితాల్లో కాంగ్రెస్, బి జెపి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 నుంచి 9 స్థానాల్లో విజ యం సాధిస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. మరోవైపు బిజెపి కూడా ఇదే స్థాయిలో సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నాయి. బిఆర్ఎస్ మాత్రం 0 నుంచి ఒకటికి పడిపోనుందని జోస్యం చెప్పాయి. ఆరా, ఇండి యా టివి, పీపుల్స్ పల్స్, ఏబీపీ సీ ఓటర్, ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ కాంగ్రెస్, బిజెపి మధ్య నువ్వానేనా అని పోటీ ఉన్నట్లు తేల్చాయి. జన్‌కీబాత్ మాత్రం బిజెపికి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఎంఐఎం పార్టీకి హై దరాబాద్ స్థానం మళ్లీ దక్కుతుందని అన్ని సర్వే సంస్థలు చెప్పడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గానూ బిఆర్‌ఎస్ 9 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. బిజెపి 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధిం చాయి. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చిన నేపథ్యంలో మెజార్టీ ఎంపీ స్థానాలు తామే సాధిస్తామని కాం గ్రెస్ మొదటి నుంచి ధీమాతో ఉన్నది. అయితే బిజెపి అనూహ్యంగా పుంజు కున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన స్థానాల కన్నా ఈసారి మాత్రం సీట్లు తగ్గవని బిఆర్‌ఎస్ భావించింది.

అయితే మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్‌లో కూటమి అధి కారంలో వస్తుందని కొన్ని సర్వేలు, తిరిగి వైసీపీ అధికారంలో రానుందని మరికొన్ని సర్వేలు సంస్థలు వెల్లడించాయి. ఒకటి రెండు సర్వేలు అధికార, కూటమి మధ్య హోరాహోరి ఉంటుందని ప్రకటించాయి. ఎపిలో కూటమిదే పట్టమని కేకే సర్వే, పీపుల్స్ పల్స్, రైజ్ ఎగ్జిట్‌పోల్స్ చెప్పుతున్నాయి. అలాగే చాణక్య స్ట్రాటజీస్, పయనీర్, ఇండియా టీవీ, జనగళం, సీఎన్‌ఎక్స్, ఇండియా న్యూస్-డీ డైనమిక్స్, ఏబీపీ సీ ఓటరు సర్వే తేల్చి చెప్పాయి. ఎపి లోక్‌సభ సీట్లలోనూ కూటమిదే ఆధిపత్యమని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. ఆరా సర్వే సంస్థ మాత్రం టిడిపికి 12 లోక్‌సభ సీట్లు, వైఎస్‌ఆర్‌సిపికి 13 సీట్లను ఇచ్చింది. ఎపిలో వైసీపీ, కూటమి తరుఫున టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీతో కలిసి పోటీ చేసింది. అయితే ఈ సర్వేలన్నీ కూడా రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో, అసెంబ్లీలో సీట్లు రావని తేల్చి చెప్పాయి.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు-ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్ బిఆర్‌ఎస్ బిజెపి ఎంఐఎం
ఆరా                        7-8       0    8-9      1
ఇండియాటీవీ-సిఎన్‌ఎక్స్ 6-8      0-1    8-10     1
పీపుల్స్ పల్స్            7-9      0-1     6-8     1
ఎబిపి-సీ ఓటర్          7-9      0         7-9     1
జన్‌కీ బాత్             4-7        0-1     9-12    1
న్యూస్ 18             5-8        2-5     7-10    0-1

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News