Monday, December 23, 2024

లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ కటీఫ్?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ కటీఫ్ చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలతో టికెట్ల పంచాయతీ తేలడంలేదు. కాంగ్రెస్ బలంగా ఉన్న సెగ్మెంట్లను అడగడంతో హస్తం పార్టీ పునరాలోచనలో పడింది. కొత్తగూడెం, పాలేరు, మిర్యాలగూడ, మునుగోడు స్థానాలను కమ్యూనిస్టులు కోరుతున్నారు.

కాంగ్రెస్‌కు మునుగోడు, పాలేరు, మిర్యాలగూడలో బలమైన అభ్యర్థులు ఉండడంతో పొత్తుకు ఆ పార్టీ నాయకులు అంగీకరించడంలేదు. వామపక్షాలతో కుదిరితే ఫ్రెండ్లీ కంటెస్టింగ్ లేదంటే కటీఫ్ చెప్పే యోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ ముందు తమ అభిప్రాయాన్ని టి కాంగ్రెస్ నేతలు తెలపడంతో ఆ పార్టీ అధిష్టానం గురువారం నిర్ణయం తీసుకోనుంది. పొత్తు కుదరకపోతే కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు పోటీ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News