Saturday, November 2, 2024

పంజాబ్‌లో కల్లోలం ఏర్పడితే యావద్దేశానికే నష్టం

- Advertisement -
- Advertisement -

పంజాబ్‌లో కల్లోలం ఏర్పడితే యావద్దేశానికే నష్టం
రైతుల ఆందోళనపై కాంగ్రెస్ హెచ్చరిక

Congress warns to Centre over Farmers Protest

న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనను వెంటనే పరిష్కరించాలని బుధవారం కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. రైతుల ఆందోళన కారణంగా పంజాబ్‌లో కల్లోలం ఏర్పడితే అది యావద్దేశానికి వ్యాపించగలదని కాంగ్రెస్ హెచ్చరించింది. లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు రవనీత్ సింగ్ బిట్టూ బుధవారం రైతుల ఆందోళనను ప్రస్తావిస్తూ రైతుల డిమాండ్లకు పరిష్కారం కనుగొనేందుకు అన్ని రాజకీయ పక్షాల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు.

భారతదేశ పురోభివృద్ధికి రైతుల కృషి ఎంతో ఉందని, వీరిలో చాలామంది దేశ సరిహద్దులను కాపాడిన వారు కూడా ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం సాగుతున్న రైతుల ఆందోళనకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కనుగొనాలని, లేనిపక్షంలో పరిస్థితి తీవ్రతరం కాగలదని ఆయన హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లోకి అక్రమంగా ప్రతిరోజు డ్రోన్ల ద్వారా బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు రవాణా అవుతున్నాయని ఆయన చెప్పారు. గతంలో సరిహద్దుల మీదుగా ఒక డ్రోన్ చొరబడేదని, కాని ప్రస్తుతం ప్రతి రోజు 30, 40 డ్రోన్ల ద్వారా 30 నుంచి 40 కిలోల ఆర్డీఎక్స్, ఇతర పేలుడు పదార్థాలు అక్రమంగా పంజాబ్‌లోకి రవాణా అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌లో కల్లోల పరిస్థితి ఏర్పడితే అది యావద్దేశంపై ప్రభావం చూపగలదని ఆయన హెచ్చరించారు.

Congress warns to Centre over Farmers Protest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News