Friday, December 20, 2024

కర్నాటకలో అధికారం కాంగ్రెస్‌దే: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో అధికారం కాంగ్రెస్‌దే
సీనియర్ నేత శరద్ పవార్ వెల్లడి
పలు ప్రాంతాల్లో బిజెపి లేదు
ఇదే దేశ రాజకీయ పరిస్థితి అని వ్యాఖ్య
షోలాపూర్: కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎన్‌సిపి నేత శరద్ పవార్ ఆదివారం చెప్పారు. పుణ్యక్షేత్రం అయిన పండరీపూర్‌కు వచ్చిన సందర్భంగా ఈ 82 సంవత్సరాల రాజకీయ దిగ్గజం విలేకరులతో మాట్లాడారు. బిజెపి ఇప్పుడు ఐదారు రాష్ట్రాలలో అధికారంలో ఉందని, మిగిలిన రాష్ట్రాలలో బిజెపియేతర ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపిన పవార్ దేశ రాజకీయ ముఖచిత్రం గురించి ఇంతకంటే ఎక్కువగా చెప్పేందుకు ఏమీ లేదన్నారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తనకు వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కేరళలో బిజెపి లేదు, తమిళనాడుకు వెళ్లలేదు. కర్నాటక తరువాతి పరిణామం గురించి తెలియచేశానని , తెలంగాణాలో బిజెపి ఉందా ? లేదే , ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేరే పార్టీనే ఉంది.

మహారాష్ట్రలోనే ఏక్‌నాథ్ షిండే తెలివితేటలతో ఏదో విధంగా బిజెపి కొంతైనా అధికారంలో ఉందన్నారు. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, బెంగాల్ ఈ రాష్ట్రాల్లోనూ బిజెపి విపక్షంగానే ఉందని తెలిపిన పవార్ దేశ రాజకీయ పటంలో బిజెపి స్థానం నామమాత్రమే అన్నారు. మధ్యప్రదేశ్‌లో దొడ్దిదారిలో బిజెపి అధికారంలోకి వచ్చింది. కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలను కూడగట్టుకుని పవర్ తెచ్చుకుందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏమి జరుగుతుందనేది ఇప్పటికిప్పుడు తాను అంచనా వేసి చెప్పడం కష్టమే అన్నారు. రత్నగిరి జిల్లాలోని బర్సూలో గ్రామస్తులు మెగాపెట్రోలియం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావింగా ఎక్కడైనా స్థానికుల మనోభావాలను పరిగణనలోకి తీసుకునే ప్రభుత్వం తగు విధంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రజల ప్రయోజనాలే కీలకం అన్నారు.

Also Read: కాంగ్రెస్ కు వెన్నుల్లో భయం పట్టుకుంది: మోడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News