Friday, December 20, 2024

సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారు: పొన్నం ప్రభాకర్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ పాలక వర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సెస్ పరిధిలోని రైతులు, ఇతర విద్యుత్ వినియోగదారులు అధికార తెరాసకు వ్యతిరేకంగా ఉన్నారని, అధికార తెరాస పార్టీ రైతులకు, ఇతరులకు ఇచ్చిన హమీలు నెరవేర్చలేదనే కోపంతో ఉన్నారన్నారు.కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెస్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను మండలాల వారి సమావేశాల్లో నిర్ణయించి వారి గెలుపుకోసం కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జీ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల పట్టణ కమిటీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జిల్లా ఎస్‌సి సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, సిరిసిల్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజ్, మంగ కిరణ్, బాలకిష్టయ్య, వెంకటేశం, రవి, శ్రీనివాస్, దేవయ్య, కిరణ్, బాలరాజు, యాదయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News