Monday, January 20, 2025

ఢిల్లీ ఎంపి స్థానాలన్నింటికీ కాంగ్రెస్ పోటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. ఈ విషయాన్ని పార్టీ నేత అల్కా లంబా బుధవారం స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) అధికారంలో ఉంది. బిజెపికి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన ఇండియా ప్రతిపక్ష కూటమి ఐక్యత ఢిల్లీ ఎంపి సీట్లపై పోటీతో ప్రభావితం కానుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాలపై పోటీకి తగు వ్యూహాల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ బుధవారం సుదీర్ఘ సమావేశం జరిపింది.

అన్ని స్థానాలకు పోటీ చేయాల్సిందేనని, స్థానాలను వదులుకుంటే నష్టం ఏర్పడుతుందని అభిప్రాయపడినట్లు వెల్లడైంది. ఈ రోజు మూడు గంటల పాటు సమావేశం అయినట్లు , దీనికి రాహుల్ గాంధీ, ఖర్గే, కెసి వేణుగోపాల్, దీపక్ బెనర్జీలు హాజరైనట్లు అల్కా తెలిపారు. ఎంపి స్థానాలకు ఢిల్లీ విభాగం సమాయత్తత గురించి ఈ సందర్భంగా సమీక్షించారు. ఎన్నికలకు ఇప్పటికీ ఏడు నెలల సమయం ఉందని, ఇప్పటినుంచే సర్వం సన్నద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు నేతలు తెలిపినట్లు వెల్లడైంది.

వారు పోటీకి దిగితే ఇండియాతో పనేముంది ః ఆప్ అసంతృప్తి
అన్ని స్థానాలకు కాంగ్రెస్ పోటీ పడుతుందనే వార్తలపై ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలలో తమతో వారు కలిసిపనిచేయకపోతే ఇక తాము ఇండియా కూటమి తదుపరి భేటీకి హాజరు కావడం వల్ల ఉపయోగం ఏదీ లేదని పార్టీ నేత ప్రియాంక కక్కర్ తెలిపారు. ఈ ఎన్నికలలో ఇతర పార్టీలతో కలిసి పనిచేసేందుకు, కూటమిగా పోటీకి దిగేందుకు ,బిజెపిని ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధమేనని,

ఇప్పటికీ కాంగ్రెస్ నుంచి ఈ దిశలో సానుకూల స్పందనను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ పోటీకే వారు సిద్దం అయితే, తాము చేసేది ఏమీ ఉండదని, వచ్చే సారి ముంబైలో జరిగే ఇండియా భేటీకి హాజరు కావాలా? వద్దా అనేది తమ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించుకుంటుందని ప్రియాంక కక్కర్ తెలిపారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఒంటరిగా వెళ్లుతుందని తమకు తెలిసిందని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News