Saturday, December 21, 2024

పార్టీ నిర్ణయిస్తే ముఖ్యమంత్రి నవుతా: డికె శివకుమార్

- Advertisement -
- Advertisement -

కర్నాకటలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగానాలకు మరోసారి బలం చేకూరింది. భవిష్యత్తులో తనను ముఖ్యమంత్రిగా నియమించడంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ బుధవారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. ఆలయ సందర్శన నిమిత్తం ఉత్తర కన్నడ జిల్లాకు వచ్చిన శివకుమార్‌కు ఆలయ అర్చకుడు ఆశీర్వచనాలు అందచేస్తూ త్వరలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేలా దేవుడు అనుగ్రహించాలని దీవించారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కోరుకుంటున్నారా అంటూ విలేకరులు ప్రశ్నించగా ఆలయ పూజారి తన గురించి దేవుడిని ప్రార్థించడంలో తప్పేముందని అన్నారు. పూజారి తన మనసులోని కోరికను దేవుడికి తెలియచేశారని,

ప్రస్తుతం సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారని, తాను ఆయన కింద ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానని డికె అన్నారు. తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నానని తెలిపారు.తాను ముఖ్యమంత్రిని కావాలని ప్రజలు ఆశిస్తుంటారని, అయితే దాన్ని నిర్ణయించేది తమ పార్టీ అధిష్టానమేనని ఆయన తెలిపారు. ప్రస్తుతం తామంతా సిద్దరామయ్య నాయకత్వంలో పనిచేస్తున్నామని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలన్నదే తమ ఆకాంక్షని ఆయన చెప్పారు. తమ కోసం ప్రార్థించే అభిమానులు, పూజారులు కూడా ఉంటారని, వారంతా తమ అభీష్టాలను వ్యక్తం చేస్తుంటారని, వారిని అలా చేయవద్దని ఆపగలమా అని డికె ప్రశ్నించారు. గుడిలో దేవుడికి, భక్తుడికి మధ్య ఉండేది భక్తని, పూజారి తన మనోభావాలను దేవుడికి చెప్పుకున్నాడని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News