హైదరాబాద్ : ఛత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలెట్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని, భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ 4 వేల కి.మీ. పాదయాత్ర చేశారని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓట్ ఫర్ చేంజ్ మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారన్నారు.
రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వాలని సచిన్ పైలెట్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉందని సచిన్ పైలెట్ తెలిపారు. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కేంద్రం రాజస్థాన్‌కు ఎలాంటి సహకారం ఇవ్వలేదని, ప్రజ లు అర్ధం చేసుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బిజెపికి వ్యతిరేక ంగా ఓటేశారని, సిఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్‌లో ఉండదని, అధిష్టానం ముఖ్యమంత్రిని సెలక్ట్ చేస్తుందని సచిన్ పైలెట్ తెలిపారు.