Monday, April 7, 2025

ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది: ఖర్గే

- Advertisement -
- Advertisement -

కలబుర్గి(కర్నాటక): వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని ఆయన చెప్పారు.

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు సక్రమంగా పనిచేస్తున్నాయని, ఆ రాష్ట్రాలలో ప్రజలు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలు వేటినీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం లేదా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి వాగ్దానాలు వేటినీ బిజెపి నెరవేర్చలేదని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం కర్నాటకను నిర్లక్షం చేస్తోందని కర్నాటకలోని కలబుర్గి జిల్లా పర్యటనకు వచ్చిన ఖర్గే ఆరోపించారు. కర్నాటకకు ఒక్క కేంద్ర ప్రాజెక్టును కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News