Monday, December 23, 2024

కాంగ్రెస్‌ని గెలిపిస్తే అన్ని వర్గాల కోటా పెంపు: సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు 2023లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల రిజర్వేషన్ కోటాను పెంచుతామని ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య శనివారం తెలిపారు. ఓబిసి కోటా నుంచి ముస్లింలను తొలగించి వొక్కలిగాస్, లింగాయత్‌ల రిజర్వేషన్లను ఇటీవల బిజెపి పెంచడాన్ని ఆయన దుయ్యబట్టారు. ‘వారు 2ఎ క్యాటగిరి కోసం అడిగారు. ప్రభుత్వం కొత్త క్యాటగిరీలను రూపొందించడానికి బదులుగా, ముస్లింలను తీసేశారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం’ అని సిద్దరామయ్య ప్రశ్నించారు.

ఒక ప్రశ్నకు సమాధానంగా ‘రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం. వాస్తవానికి ప్రియాంక్ ఖర్గే సామాజిక సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వం జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీని ఏర్పాటు చేసింది. లింగాయత్, ఒక్కలిగాలకు రిజర్వేషన్లు పెంచాల్సిందే. కానీ అందుకు ముస్లిం రిజర్వేషన్లను లాగేసుకోవడం దేనికి? రిజర్వేషన్లు పెంచాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేయాలని ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడంలేదు? అదేమి చేయకుండానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదు’ అని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదని సిద్దరామయ్య ఆరోపించారు.

‘అవినీతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఉన్నాయి. మహిళలకు రక్షణ కరువయింది. వారు కేవలం విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారు. హిందూత్వ ప్రభావంతో వారు ఓట్లు నెగ్గాలని చూస్తున్నారు. అయతే కాంగ్రెస్‌కు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ తప్పక మెజారిటీ సాధిస్తుంది. అవినీతి విషయంలో ముఖ్యమంత్రి బొమ్మై తీసుకుంటారని నేననుకోవడంలేదు’ అని చెప్పుకొచ్చారు.

‘వరుణ నియోజవర్గం నుంచి పోటీచేయడానికి నా కుమారుడు ఆ స్థానాన్ని ఖాళీ చేశాడు. ఈ నియోజకవర్గంలోనే నా గ్రామం ఉంది. నేనిక్కడ పోటీచేశాకే ప్రతిపక్ష నాయకుడినయ్యాను. ముఖ్యమంత్రిని కూడా అయ్యాను. ఈ నియోజకవర్గంతో నాకు భావోద్వేగ సంబంధాలున్నాయి. ఇదే నా చివరి ఎన్నికలు. అందుకనే నేను నా స్వంత గ్రామం ఉన్న నియోజకవర్గం నుంచి పోటీచేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News