Monday, December 23, 2024

కలిసొచ్చే పార్టీలతో పొత్తు: సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కలిసొచ్చే పార్టీలతో చేతులు కలుపుతామని సోనియాగాంధీ మంగళవారం తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌తో ఏకీభవించే పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటామని సందేశాన్ని అందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆయన ప్రభుత్వం శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలను క్రమపద్ధతిలో కూల్చివేస్తున్నట్లు సోనియా గాంధీ విమర్శించారు.

మోడీ సర్కారు చర్యలు వారిలోని లోతైన ప్రజాస్వామ్య వ్యతిరేకతను వెల్లడిస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి అజ్ఞానం వల్ల ప్రజ్వరిల్లుతుందన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ దీనికి ఆజ్యం పోస్తున్నాయని కాంగ్రెస్ మాజీ చీఫ్ ఆరోపించారు. దేశంలోని శాంతి, సామరస్యం పెంపొందించేలా బిజెపి ఒక్కసారి కూడా పిలుపునివ్వలేదన్నారు. మతపరమైన ఉత్సవాలు అన్య మతస్థులను బెదిరించేలా మారిపోయాయన్నారు.

ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకునే బదులు మతం, ఆహారం, కులం, భాషాపరంగా వివక్ష చూపుతున్నారన్నారు. ప్రధాని ప్రజావ్యతిరేక చర్యలును చూస్తూ దేశం, దేశప్రజలు మౌనంగా ఉండరాదని పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా కోరారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి కొన్ని నెలలు అత్యంత కీలకమని, దేశం నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. మోడీ ప్రభుత్వం తమకున్న ప్రతి అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. చాలా కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు చేరువ అవుతున్నాయని సోనియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రయత్నం దేశప్రజలకు నేరుగా చేరేలా భారత్ జోడో యాత్ర తరహాలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి విపక్షాలతో కలిసి పోరాడతామని ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News