Monday, December 23, 2024

శ్రీరామ విగ్రహ ప్రతిష్టకు కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు: టిపిసిసి నాయకులు నిరంజన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఈనెల 22వ తేదీన జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్టకు కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదని టిపిసిసి నాయకులు నిరంజన్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది బిజెపి కార్యక్రమం అన్న విషయం యావత్ భారత దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులు కూడా దీనిని గమనిస్తున్నారని, ప్రపంచం మొత్తం మానవాళి కొలిచే దేవుడు శ్రీరామచంద్రుడు, కానీ, శ్రీరామచంద్రుడు బిజెపికి సంబంధించిన వ్యక్తి కాదని ఆయన పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడు దేవుడైన మానవుడిలా జీవితాన్ని కొనసాగించి మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, అలాంటి ఆదర్శమూర్తిని స్వార్థ రాజకీయాల కోసం బిజెపి ఉపయోగించుకుంటుందని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News