లక్షెట్టిపేట : రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతుందని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని మార్కెట్ యార్డు రైతు వేధికలో రైతుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014కు ముందు రాష్ట్రంలో కరెంటు కష్టాలు ప్రజలకు తెలియనివి కాదన్నారు.
కేవలం రోజులో మూడు, లేదా నాలుగు గంటలు కరెటు ఇచ్చి రైతుల పంటలు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 9 నెలల్లో మిగులు విద్యుత్ సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నేడు 24 గంటలు అవసరాన్ని బట్టి రైతుల పంటలకు కరెంటు అందిస్తే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
దేశంలో అత్యధిక వరి పండిస్తూ అగ్రగామిగా తెలంగాణ ఆదర్శంగా నిలవడం రేవంత్‌రెడ్డికి నచ్చడం లేదన్నారు. అంతే కాకుండా 2009లో ఎమ్మెల్యేగా నేను లేకపోయినప్టికి గూడెం పైప్‌ల విషయంలో నన్ను బద్నామ్ చేయడం విపక్షాలకు ఇంగితజ్ఞానం లేదని స్పష్టమైందన్నారు. రూ. 11 కోట్లతో పూర్తి స్థాయిలో నూతన పైప్‌లైన్ ఏర్పాటు చేసి రైతులకు నీరందించామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. అంతే కాకుండా రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమాన్ని తీసుకెళ్లాలని సూచించారు. అంతకు ముందు పట్టణంలోని పలు వార్డుల్లో నూతన రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు సురేష్ నాయక్, రాజన్న, మెట్టు కళ్యాణి రాజు, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, నాయకులు తిరుపతి, సురేష్, దొంత నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.