Monday, December 23, 2024

ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలకు గుడ్ బై: ఉత్తమ్ కుమార్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

Congress will win massive majority in Kodad: Uttam

కోదాడలో కాంగ్రెస్‌దే విజయం
50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలకు గుడ్ బై
మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో కాంగ్రెస్‌కు 50వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. అంతకుముందు రాహుల్‌గాంధీ ఆవిష్కరించిన వరంగల్ డిక్లరేషన్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రచారంలో భాగంగా నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో రచ్చబండ/రైతు భరోసా యాత్ర సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రజలకు బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలు ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరికొత్త డ్రామాలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బిజెపి, తెలంగాణలోని టిఆర్‌ఎస్ పార్టీలు వారివారీ ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించుకుంటూ కొత్త డ్రామాకు తెరలేపాయని పేర్కొన్నారు. ‘బిజెపి, టిఆర్‌ఎస్ రెండూ అధికార పార్టీలు, నిజమైన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వారికి ఉంది.

అయితే, అధికారంలోని రెండు పార్టీలు ఇప్పుడు అధికారం పక్షంతో పాటు ప్రతిపక్షం పాత్ర కూడా పోషించాలని భావిస్తున్నాయి’ అని అన్నారు. వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్, ఎన్‌టిపిసి ద్వారా 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల ప్రస్తావనను ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా దాటవేశారని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌కు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటిఐఆర్)ను ఎందుకు రద్దు చేశారనే దానిపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఖాతాలో రూ. 15 లక్షలు వంటి వాగ్దానాల పరిస్థితుల గురించి ఆయన కనీసం ఒక్క మాటైనా ప్రస్తావించి ఉండాల్సింది. టిఆర్‌ఎస్ నిర్దేశించిన స్క్రిప్ట్‌ను చదివి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. అలాగే, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరును వివరించాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతీకాత్మకంగా కొన్ని పథకాలను అమలు చేసి, అభివృద్ధిపై తప్పుడు ప్రకటనలు చేయడానికి వాటిని పోస్టర్లుగా ఉపయోగించుకుందని ఆరోపించారు.

Congress will win massive majority in Kodad: Uttam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News