Monday, January 20, 2025

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు

- Advertisement -
- Advertisement -

జనగామటౌన్ : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి, జనగామ నియోజకవర్గ సమన్వయక్త మానవతారాయ్ అన్నారు. బుధవారం జనగామలో పీవీ.నర్సింహారావు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీకి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకరావాలని కోరారు.

జూలై 2న జరిగే రాజీవ్‌గాంధీ యూత్ క్విజ్‌లో ఎక్కువ మంది యువత పాల్గొనేలా కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ, మద్దూరు జెడ్పీటీసీ గిరికొండల్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, జంగిటి అంజయ్య, ఆది శ్రీనివాస్, బండి శ్రీను, చిరంజీవులు, సంపత్, కొన్నె మహేందర్‌రెడ్డి, వంగ వెంకట్‌రెడ్డి, పిన్నింటి నారాయణరెడ్డి, జక్కుల వేణుమాధవ్, ముస్తాల యాదగిరి, ఎండీ.మాజిద్, శివన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News