Friday, November 22, 2024

ఎగ్జిట్ పోల్స్: హర్యానాలో కాంగ్రెస్ దే హవా…. కశ్మీర్ లో హంగ్

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 50కి పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని వివిధ సర్వేలు వెల్లడించాయి.

పీపుల్స్ పల్స్ సర్వే: కాంగ్రెస్ 55, బిజెపి 26, ఐఎస్‌ఎల్‌డి 2 నుంచి 3, జెజెపి 01, ఇతరులు 3 నుంచి 5
రిపబ్లిక్ మాట్రిజ్: కాంగ్రెస్ 55 నుంచి 62 బిజెపి 18 నుంచి 24, ఐఎన్‌ఎల్‌డి+బిఎస్‌పి 3 నుంచి 6 జెజెపి 3
ఇండియా టు డే సి ఓటర్: కాంగ్రెస్ 50 నుంచి 58, బిజెపి 20 నుంచి 28, జెజెపి 0 నుంచి 2, ఇతరులు 10 నుంచి 14
పి మార్క్: కాంగ్రెష్ 44 నుంచి 54, బిజెపి 15 నుంచి 29, జెజెపి 0, ఐఎన్‌ఎల్‌డి 3 నుంచి 6 ఇతరులు 0
దైనిక్ భాస్కర్ : కాంగ్రెస్ 44 నుంచి 54, బిజెపి 19 నుంచి 29, జెజెపి 0 నుంచి ఐఎన్‌ఎల్‌డి 1 నుంచి 5 ఇతరలు 4నుంచి 9
ధ్రువ్ రీసెర్చ్: కాంగ్రెస్ 57 నుంచి 64, బిజెపి 27 నుంచి 32, ఇతరులు 5 నుంచి 8

జమ్ము కశ్మీర్ లో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. 90 అసెంబ్లీ స్థానాలలో ఏ పార్టీకి 45 స్థానాలు వచ్చే అవకాశం లేకపోవడంతో హంగ్ వచ్చే అవకాశం ఉంది వివిధ సర్వేలు పేర్కొన్నాయి.

రిపబ్లిక్‌ మ్యాట్రిక్‌: పిడిపి 28, బిజెపి 25, కాంగ్రెస్‌ 12, ఎన్సీ 15, ఇతరులు.

దైనిక్‌ భాస్కర్‌ : బిజెపి 20-25, కాంగ్రెస్‌-ఎన్సీ 35-40, పిడిపి 4-7, ఇతరులు 12-16

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News