Friday, November 15, 2024

బిజెపికి షాక్.. లింగోజిగూడలో కాంగ్రెస్ విజయం

- Advertisement -
- Advertisement -

బిజెపికి షాక్.. లింగోజిగూడలో కాంగ్రెస్ విజయం
జిహెచ్‌ఎంసీలో మూడుకు చేరిన కాంగ్రెస్ బలం

Declare national health emergency Says Congress

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. బిజెపి అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి 1,272 ఓట్ల తేడాతో గెలుపొందారు. లింగోజిగూడ డివిజన్‌లో విజయం సాధించడంతో జిహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ బలం మూడుకు పెరిగింది. బల్దియా ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసి విజయం సాధించిన రమేశ్‌గౌడ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రమేశ్‌గౌడ్ మృతితో ఆ డివిజన్‌ను ఏకగ్రీవం చేసేందుకు బిజెపి యత్నించింది. ఆ పార్టీ నేతలు మంత్రి కెటిఆర్‌ను కలిసి లింగోజిగూడ డివిజన్‌లో మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన ఆయన.. ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని నిలపమని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒప్పంచేందుకు బిజెపి నేతలు యత్నించినా లాభం లేకపోయింది. అభ్యర్థిని వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 30న ఎన్నికలు జరుగగా సోమవారం లెక్కింపు చేపట్టారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 49,203 ఓట్లకు గాను కేవలం 13591 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ 38 ఓట్లతో కలిపి మొత్తం 13,629(28 శాతం) మాత్రమే పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లలో 33 కాంగ్రెస్‌కు, 5 చెల్లని ఓట్లు ఉన్నాయి. 101 నోటాకు, 188 ఓట్లు చెల్లుబాటు కాలేదు. వరదల సమయంలో లింగోజిగూడ దాదాపుగా పూర్తిగా ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆస్తి పన్ను మాఫీకి పోరాడటంతో పాటు ఇతర అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయం సాధించిన రాజశేఖర్‌రెడ్డి గెలుపు పత్రం అందించారు. కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

Congress win in Lingojiguda Division

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News