Monday, January 20, 2025

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు తధ్యం : కర్ణాటక సిఎం సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు తధ్యమని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వివరించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండవ సారి బాధ్యతలు తీసుకున్న సిద్ధరామయ్యను బెంగళూర్‌లోని ఆయన నివాసంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు టీమ్ సోమవారం ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ జూన్‌లో

తెలంగాణలో జరగ నున్న బిసి గర్జన సభకు ముఖ్యఅతిథిగా రావాలని ఆయనను కోరామన్నారు. అయితే కర్ణాటక ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని సూచించినట్లు విహెచ్ గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తున్నాయని సిద్ధరామయ్య చెప్పినట్లు వీహెచ్‌పేర్కొన్నారు. కార్యకర్తలను కాపాడుకోవాలని, సమస్వయంతో పనిచేస్తే విజయం సులువని కర్ణాటక సీఎం సూచించినట్లు విహెచ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News