బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేడు ఉదయం 8.00 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్‌తో మొదలై చివరికి కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి కాంగ్రెస్ 137 స్థానాలు, బిజెపి 64, జెడి(ఎస్) 20, ఇతరులు 3 సాధించారు. గత ఎన్నికల్లో అంటే 2018లో కాంగ్రెస్‌కు 104, బిజెపికి80, జెడి(ఎస్)కు 37, ఇతరులు 3 స్థానాలు గెలిచారు.
కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డి.కె.శివకుమార్ ఎన్నికల అధికారి నుంచి గెలుపు ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు. కనకపుర నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన బిజెపి అభ్యర్థి ఆర్. అశోక్‌పై లక్షపై చిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. కర్నాటక విధాన సభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఓడిపోయారు. ఇక గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబంలో ఆయన ఒక్కరే విజయం సాధించారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘క్రూరమైన నిరంకుశ రాజకీయాలు ఓడిపోయాయి. ప్రజలు బహుళత్వం, ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకున్నప్పుడు, ఆధిపత్యం చెలాయించే ఏ శక్తి వారిని అణచివేయలేదు. ఇదే రేపటికి గుణపాఠం’ అని ట్వీట్ చేశారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ‘రానున్న ఆయా రాష్ట్రాల ఎన్నికల్లోనూ బిజెపికి ప్రజలు గుణపాఠం చెబుతారు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బిజెపికి ఓటమి తప్పదు’ అన్నారు.