Friday, November 22, 2024

కంటోన్మెంట్ కాంగ్రెస్‌దే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేశ్ గెలుపొందారు. బిజెపి అభ్యర్థి వంశ తిలక్‌పై శ్రీ గణేశ్ 14,285 ఓట్లతో గెలుపొందారు. శ్రీ గణేశ్‌కు 45,396 ఓట్లు పోలవ్వగా, వంశ తిలక్‌కు 31,111ఓట్లు, బిఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్నకు 28,863 ఓట్లు పోలయ్యాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత బిజెపి అభ్యర్థి శ్రీ గణేశ్‌పై విజయం సాధించారు. అనంతరం ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత లాస్య నందిత చెల్లెలు నివేదిత సాయన్నను బరిలోకి దించగా, బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన శ్రీ గణేశ్ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బిజెపి వరుసగా ఈ స్థానంలో రెండో స్థానంలోనే నిలవగాబిఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిత మూడో స్థానంలో నిలవడంతో ఆ పార్టీ తన సిటింగ్ స్థానాన్ని కోల్పోయినట్లయ్యింది.

65కు చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య
కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ గెలవడం ద్వారా ఆ పార్టీ బలం అసెంబ్లీలో 65కు పెరిగింది. బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో వారిని కలుపుకుంటే కాంగ్రెస్ బలం 67కు పెరిగింది. సిపిఐ ఒక స్థానంతో కలిపితే 68కి చేరుకున్నట్టయ్యింది. దీంతో బిఆర్‌ఎస్ బలం 39నుంచి 36కు పడిపోయింది. కాగా, తెలంగాణలో 17 ఎంపి స్థానాల్లో బిఆర్‌ఎస్ జీరో స్థానాలకే పరిమితం కాగా, అన్ని స్థానాల్లో కారు పార్టీ మూడో స్థానంలోనే ఉంది. మెదక్ సీటుపై బిఆర్‌ఎస్ ఆశలు పెట్టుకున్నా అక్కడ రఘునందన్ రావు భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News