డికె.అరుణ రాజకీయ భవిష్యత్ కోసం పని చేసింది
టిపిసిసి అధికార ప్రతినిధి కల్వ సుజాత
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ మహిళా పక్షపాతి ప్రభుత్వం అని, డికె.అరుణ రాజకీయ భవిష్యత్ కోసం పని చేసిందని, పాలమూరు కోసం పనిచేయలేదని, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని ఎందుకు బిజెపిని అడగలేదని టిపిసిసి అధికార ప్రతినిధి కల్వ సుజాత ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన దూసుకుపోతోందని, కాళేశ్వరం ఎటిఎం అయ్యిందన్న బిజెపి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. మా ప్రభుత్వం కూలిపోతుందని, అనడం కాదు, ప్రజా పాలనకు సూచనలు చేయాలని ఆమె సూచించారు. మహిళలకు ఎక్కువ ఉద్యోగాలిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని, లిక్కర్ కేసు నుంచి డైవర్ట్ చేయడానికే కవిత మహిళా అంశాన్ని ఎత్తుకుందని, కవిత స్వలాభం కోసమే డ్రామాలు చేస్తుందని ఆమె ఆరోపించారు.