Sunday, January 19, 2025

తెలంగాణలో హంగ్ ఖాయం: కోమటి రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తెలంగాణలో హంగ్ రావడం ఖాయంగా కనిపిస్తోందని ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. హైదరాబాద్-విజయవాడ హైవేను ఆరు లైన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కోమటి రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి రాదన్నారు. బిజెపితో కాంగ్రెస్ కలిసే అవకాశాలు ఉండవన్నారు. సీనియర్లు అందరూ కలిస్తే 40 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశం ఉందని  కోమటి రెడ్డి జోస్యం చెప్పారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కడే గెలిపిస్తానంటే తాము ఇంట్లో కూర్చుంటామని చురకలంటించారు. మార్చి మొదటి వారంలో యాదాద్రి నుంచి యాత్ర పారంభిస్తామని వెల్లడించారు. కొత్త ఇన్‌చార్జ్‌గా ఠాక్రే వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ గాడిలో పడిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News