Thursday, January 23, 2025

కాంగ్రెస్‌కు 70 సీట్లు వస్తాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేస్తామని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ నుంచి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 70 సీట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. అత్యధిక అవినీతి సిఎం కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిందని ఉత్తమ్ ఆరోపణలు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. పోలీస్ అధికారులను బిఆర్‌ఎస్ నేతలు తమ ఆధీనంలో ఉంచుకోవడం మంచిది కాదని హితువుపలికారు. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు భూకుంభ కోణాలు, ఇసుక, లిక్కర్ మాఫీయాలు చేస్తూ దొంగల ముఠాల తయారైందని ఉత్తమ్ విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News