సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్(ఎస్‌ఎంసి) ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఎస్‌ఎంసిలోని 34 వార్డులలో 24 వార్డులను గెలుచుకున్న కాంగ్రెస్ బిజెపి నంపంచి ప్రతిష్టాత్మక కొర్పొరేషన్‌ను చేజిక్కించుకుంది. గురువారం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. కేవలం తొమ్మిది వార్డులను గెలుచుకుని బిజెపి సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. ఒక వార్డులో సిపిఎం అభ్యర్థి గెలుపొందారు.
Also Read: కర్ణాటకలో మతతత్వ పూనకం!
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో పాదం మోపాలని ఆశపడిన ఆమ్ ఆద్మీ పార్టీకి భంగపాటు ఎదురైంది. ఆప్ అభ్యర్థులు 21 వార్డులలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇది వరుసగా మూడవ విజయం. 2021లో ఒక లోక్‌సభ, 3 అసెంబ్లీ స్థానలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రతిభా సింగ్ సారథ్యం వహిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రమాణం త్వారత జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం.