Thursday, January 23, 2025

బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : బలహీన వర్గాల అభివృద్ధి కా ంగ్రెస్‌తోనే సాధ్యమని కాం గ్రె స్ పట్టణ అధ్యక్షుడు శ్రీ కా ంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కా ంగ్రెస్ ఆధ్వర్యంలో జోడో అభియాన్ యాత్రలో భాగంగా పు రపాలక సంఘం పరిధిలోని భగవత్ సింగ్ తండాలో ఇంటింటికి తిరుగుతూ ప్లీనరీ అంశాలపై ప్రజలకు అ వగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 500లకే సిలిండర్, రెండు లక్షల వరకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ఎజెండా తయారు చేస్తుందన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాని యాదవ్, జగన్,గోపాల్, రాజు నాయక్, శేఖర్, సైదులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News