Monday, December 23, 2024

పేసీఎం టీ-షర్టులు ధరించిన కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Congress workers arrested for wearing Pay CM T-shirts

మాండ్యా ( కర్ణాటక ) : కర్ణాటక రాష్ట్రం లోని మాండ్యా జిల్లాలో శనివారం భారత్ జోడో యాత్రలో పేసీఎం టీ-షర్టులు ధరించిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ భారత్ జోడోయాత్ర మాండ్యా జిల్లాలో సాగుతుండగా, ఈ ఘటన జరిగింది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పే సిఎం, పే అశ్వత్ నారాయణ్, పే ఈశ్వరప్ప పేరిట ప్రింటెడ్ టీషర్టులు ధరించి రాహుల్ వెనుక భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పే సిం పేరిట ప్రచారం చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News