Saturday, January 11, 2025

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..? : హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం అని, కానీ కాంగ్రెస్ వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం..?..ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన..? అని ప్రశ్నించారు.

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఇలాగే దాడులు జరిగి ఉంటే మీకు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా…?.. బిఆర్‌ఎస్ పార్టీపైన గోబెల్స్ ప్రచారం చేసే అవకాశం ఉండేదా..? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, ఏడాది కాంగ్రెస్ పాలనలో అశాంతి, అలజడి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతమవుతే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News