Sunday, February 23, 2025

కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వార్.. మీడియా ప్రతినిధులపై దాడి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ : కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనలో పోలీసుల ముందే మీడియా మీద కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా దాడి చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు రేవంత్ రెడ్డి ప్రోగ్రాం బాయ్‌కాట్ చేశారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు.

Congress workers attacked media representativesపరమేశ్వర్ రెడ్డి అనుచరులు రేగా లాక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను చింపేశారు. ఫ్లెక్సీలు చింపుతుండగా వీడియోలు తీస్తున్న మీడియా రిపోర్టర్ల పై పరమేశ్వర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. వెంటపడి మీడియా ప్రతినిధుల పై దాడి చేశారు. పోలీసుల ముందే మీడియా ప్రతినిధులపై దాడి చేస్తుండగా అడ్డపడిన పోలీసులు కింద పడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News