Monday, December 23, 2024

ప్రజాహిత యాత్రను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. కాంగ్రెస్ మూకలు కర్రలు పట్టుకుని ప్రజాహిత యాత్రను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ మూకల తీరుపై కాషాయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ డౌన్ డౌన్, ఖబడ్దార్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులను ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా పోలీసులు నిలువరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్ నేతలు కర్రలతో వస్తుంటే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బిజెపి నేతల మండిపడుతున్నారు. బిజెపి నేతలను సైతం ప్రజాహిత యాత్రకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి బిజెపి నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు, హుస్నాబాద్ బిజెపి అభ్యర్ధి బొమ్మ శ్రీరాం చక్రవర్తిని ప్రజాహిత యాత్ర క్యాంపుకు వెళ్లకుండా పోలీసులు నిలువరించారు. మా పార్టీ నాయకుడిని తాము కలిసేందుకు వెళుతుంటే… అడ్డుకోవడమేంటని బొమ్మ శ్రీరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతలను కూడా ప్రజాహిత క్యాంపువైపు వెళ్లనిచ్చేది లేదని పోలీసులు చెబుతున్నారు.

కాంగ్రెస్ నేతల తీరుపై బిజెపి ఎంపి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే ఖబడ్దార్… అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాహిత యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలియడంతో బిజెపి శ్రేణులు అప్రమత్తమయ్యాయి. బండి సంజయ్ కు మద్దతుగా యాత్ర వద్దకు బిజెపి శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. మరో వైపు హుస్నాబాద్ నియోజకవర్గం బొమ్మెనపల్లి నుండి రెండో రోజు ప్రజాహిత యాత్రకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News