Thursday, December 19, 2024

కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా రాహుల్ కావాలి

- Advertisement -
- Advertisement -

Congress workers demand that Rahul become party chief

మద్దతుగా వేల కాంగ్రెస్ కార్యకర్తల నినాదాల హోరు

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని రామ్‌లీలామైదానంలో ఆదివారం ‘మెహంగాయి పర్ హల్లా బోల్ ’ పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు తరలివచ్చిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్ అంటూ సాగించిన నినాదాలు మిన్నుముట్టాయి. చాలామంది కార్యకర్తలు మరోసారి కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి రాహుల్ పార్టీ చీఫ్ కావాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. మా నిజమైన నేత రాహుల్‌జీ.. ఆయనపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ వైభవాన్ని ఆయన తిరిగి తీసుకొస్తారు.

ఆయన పార్టీ చీఫ్ కావాలి అంటూ దీపేష్ సింగ్ డిమాండ్ చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ నుంచి ఆయన ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పొందిన తరువాత రాహుల్ తన పార్టీ ఉన్నత పదవికి రాజీనామా చేశారు. 2019 ఆగస్టు నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, తదితర సమస్యలను ఎత్తిచూపుతూ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న భారత్ జోడో యాత్ర కన్నా ముందుగా ఈ ర్యాలీ చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500కిమీ పొడవునా ఈ జోడో యాత్ర జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News