జమ్మూ: బిజెపి ప్రోద్బలంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ దిష్టిబొమ్మను ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం నాడిక్కడ దగ్ధం చేశారు. కాంగ్రెస్ నుంచి ఆజాద్‌ను బహిష్కరించాలంటూ పెద్ద పెట్టున వారు నినాదాలు చేశారు. రాజ్యసభ నుంచి రిటైర్ అయినందుకు ఆజాద్‌కు సన్మానం పేరుతో ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహించిన కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుల బృందం(జి-23) పార్టీ నాయకత్వానికి ఒక హెచ్చరికను పంపే విధంగా చేసిన వ్యాఖ్యలతో ఆజాద్‌కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తల నుంచి పెద్దపెట్టున మొట్టమొదటిసారి ప్రతిఘటన ఎదురైంది. పార్టీకి పూర్తి స్థాయి, ప్రత్యక్ష నాయకత్వం కావాలని కోరుతూ 23 మంది కాంగ్రెస్ సీనియర్లు గత ఏడాది ఆగస్టులో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయడంతో వీరిని జి-23గా వ్యవహరిస్తున్నారు. కాగా.. మంగళవారం జిల్లా అభివృద్ధి మండలి సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మొహమ్మద్ షానవాజ్ చౌదరి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రెస్ క్లబ్ వద్ద ప్రదర్శన నిర్వహించి ఆజాద్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
జమ్మూలో గులాం నబీ దిష్టిబొమ్మ దగ్ధం
- Advertisement -
- Advertisement -
- Advertisement -