Saturday, December 21, 2024

మానుకోట ఎంఎల్ఎపై కన్నెర్ర…. దొర గడికి తాళం వేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. పేద,బడుగు బలహీన వర్గాలకు, గిరిజనులకు అండగా ఉంటారని గెలిపిస్తే ప్రతి రోజు దొరగడికి వెళ్లి సలాం కొడుతున్నారని మాజీ ఎంపీటీసీ చీమన నాయక్, కార్యకర్తలు రమేష్, మురళి, వాలు నాయక్, సిపిఐ నాయకులు లింగ్యా నాయక్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దొరగడిలో కార్యకర్తలు ఆగ్రహంతో కుర్చీలు విసిరి కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో 1.5 లక్ష రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ను ధ్వంసం చేశారని సదరు ఇంటి యజమాని రెడ్డి కేసు పెట్టారు. ఫర్నిచర్ ధ్వసం చేసిన వాళ్ళు జరిమానా కట్టిన తరువాత కేసు విత్ డ్రా చేసుకున్నట్టు సమాచారం. కొంతమంది దొరకు మద్దతుగా మరికొందరు ఎమ్మెల్యే కు మద్దతుగా మరికొందరు ఇద్దరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముష్టి యుద్ధానికి దిగారు. కేవలం 2 లేదా 3 శాతం ఓట్లు ఉన్న దొరల మాటలు వింటూ తమను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News