Tuesday, March 4, 2025

నవంబర్ 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నవంబర్ 29న సమావేశం కానుంది. ఈ సమావేశంలో హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై చర్చించే అవకాశం ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అదానీ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు హర్యానా, మహారాష్ట్రలో పార్టీ ఓటమిపై సమీక్షించనున్నారు.

పార్టీ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో ఎన్నికలకు సన్నాహాలు, పొత్తుల అవకాశాలను, అలాగే వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు చేపట్టాల్సిన సన్నాహాలను కూడా చర్చించనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News