Thursday, January 16, 2025

కాంగ్రెస్ పనిచేసేది ఓటు బ్యాంకు కోసమే

- Advertisement -
- Advertisement -

Congress works only for vote bank

రాహుల్‌పై అమిత్‌షా ధ్వజం

జైపూర్ : రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ను టార్గెట్ చేసి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం విమర్శలు గుప్పించారు. ఒకసారి భారత్ దేశం కాదని రాహుల్ చెప్పాడని, ఇప్పుడు మాత్రం విదేశీ తయారీ టి షర్టు వేసుకుని దేశాన్ని ఐక్యం చేయడం కోసం అని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. రాజస్థాన్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగిస్తూ ఉదయ్‌పూర్ టైలర్ కన్హయియా లాల్ ను ముస్లిం ఉగ్రవాదులు హత్య చేసిన కరౌలీ హింసాత్మక సంఘటనను ప్రస్తావించారు. ఓటుబ్యాంకును దృష్టిలో పెట్టుకుని బుజ్జగింపులతో కాంగ్రెస్ రాజకీయాలు నడుపుతుందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో భారత్ ఒక దేశం కాదని రాహుల్ ఇచ్చిన ప్రసంగాన్ని రాహుల్‌కు, కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తు చేస్తున్నానని, ఏ పుస్తకంలో ఇది చదివావు రాహుల్ బాబా అని ప్రశ్నించారు.

భారత్ ఒక దేశమని, దీనికోసం లక్షలాది ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు జోడో యాత్రలో ఐక్యభారత్ అని విదేశీ టి షర్టు ధరించి నినాదం ఇస్తున్నారని ఆరోపించారు. రూ. 41,000 విలువైన బర్బరీ టి షర్టు రాహుల్ ధరించడాన్ని బీజేపి ఎత్తి చూపడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్‌తో అనుసంధానం కావడానికి రాహుల్ ముందుకొచ్చారని, అయితే మొదట భారత చరిత్ర ఆయన అధ్యయనం చేయాలన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పనిచేయలేదని, బుజ్జగించి ఓటుబ్యాంకు రాజకీయాలు నడపడానికే కాంగ్రెస్ పనిచేస్తుందని విమర్శించారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాక, కాంగ్రెస్ ఏమీ చేయలేక బయటకు వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News