Monday, December 23, 2024

కాంగ్రెస్ యుక్త్ బిజెపి : శశిథరూర్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

Congress Yukt BJP: Shashi Tharoor Comment

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతలు వరుసపెట్టి బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారని, బీజేపీ అంతా కాంగ్రెస్ నేతలతో నిండిపోతోందని, కాంగ్రెస్ యుక్త బీజేపీగా మారి పోతోందని కాంగ్రెస్ సీనియర్‌నేత శశిథరూర్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. బుధవారం తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ఎవరి ఆశయాల కోసమో ఇళ్లు వదిలేస్తున్నారని, అక్కడ కూడాఅంతా మనవాళ్లే ఉన్నారని థరూర్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలంతా కాంగ్రెస్ ముక్త్‌భారత్ నినాదాన్ని చాలా కాలంగా ఇస్తున్నారని, ఇది చాలాకాలంగా వినిపిస్తున్నప్పటికీ మోడీనాయకత్వం ఎక్కు ప్రచారాన్ని కల్పించిందని, ఆ నినాదాన్ని గుర్తు చేసేలా కాంగ్రెస్‌యుక్త్ బీజేపీ అని థరూర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News