Saturday, November 23, 2024

నేడు హైదరాబాదులో యువ సంఘర్షణ సభ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో నిర్వహించే యువ సంఘర్షణ సభకు ఆమె హాజరుకానున్నారు. ప్రియాంక సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ్నించి ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ పయనమవుతారు. సాయంత్రం 4.30 గంటలకు సరూర్ నగర్ సభలో ప్రియాంక ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రియాంక గాంధీ సభ నుంచి తిరుగు పయనమవుతారు.

యువతకు భరోసా ఇచ్చేందుకే యువ సంఘర్షణ సభ
నిరాశలో ఉన్న యువతుకు భరోసా ఇచ్చేందుకే సరూర్‌నగర్‌లో సోమవారం కాంగ్రెస్ నిరుద్యోగ భరోసా సభను ఏర్పాటు చేస్తున్నట్లు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ సభలో పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు. పెద్దఅంబర్ పేట్ కూడలి వద్ద కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, వి. హనుమంత రావు, జగ్గారెడ్డి తదితర ముఖ్యనేతలతో కలిసి భట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో యువత తీవ్ర ఆవేదనలో ఉందన్నారు. నిరుద్యోగుల కోసం తమ పార్టీ కార్యాచరణను సభలో వివరిస్తామని తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు కచ్చితంగా న్యాయం జరగాలన్నారు.

గతంలో తమ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూము లను ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని ఆరోపించారు. దాదాపు 10 వేల ఎకరాలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని మండి పడ్డారు. ఇబ్రహీంపట్నం పరిధిలోనే రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.25 లక్షల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం వెనుక్కి తీసుకొందని ఆరోపణలు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువతకు కచ్చితంగా న్యాయం జరగాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని భట్టి విక్రమార్క తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News