నల్లగొండ: పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెసోళ్ళకు వ్యవసాయం అంటే తెలియదు.. నోటికి వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారు.. అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గోడలపై రాతలు రాయడం.. పేర్లబోర్డులు రాయడం రేవంత్ వృత్తి అని, కోమటిరెడ్డి ఆవారా నెంబర్‌వన్, మతిస్థిమితం లేకుండా మాట్లాడటం అలవాటు.. సురాపానీయం సేవించడానికే పొలంకు వెళ్తాడు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ పట్టణంలోని ఆయన నివాసంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నలమోతు భాస్కర్‌రావుతో కలిసి శుక్రవారం విలేకరులతో మా ట్లాడారు. కరెంట్ కొనుగోళ్ళు 70శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగితే.. 30 శాతం ఎన్‌ఎల్‌డిసి(నేషనల్ లోడ్ డిస్‌ప్యాచ్ సెంటర్) ద్వారా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అలాంటప్పుడు అవినీతి జరగడం.. కమీషన్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కరెంట్ సరఫరాపై కాంగ్రెస్‌నేతలు అసత్య ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బషీర్‌బాగ్ కాల్పులకు కేసిఆర్ కారణమని రేవంత్ అనడం అవివేకమన్నారు.
చంద్రబాబు హయాంలో రైతు వ్యతిరేక విధానాలే మలిదశ ఉద్యమానికి కారణమయ్యాయని, అప్పట్లో కేసిఆర్ అసెంబ్లీలో వ్యతిరేకించారని గుర్తు చేశారు. తొమ్మిదేళ్ళలో కరెంట్ రావడంలేదు.. లోవోల్టేజీ సమస్య ఉంది.. అని రైతులు రోడ్లపైకి వచ్చారా? అ సెంబ్లీలో మీరు ఏనాడైనా ప్రశ్నించారా? చెప్పాలని డిమాండ్ చేశారు. టెండర్లు పిలిచి పారదర్శకంగా ఒకే ఒక్క ప్రైవేట్ సంస్థ నుండి కొ నుగోలు చేశామని చెప్పారు. మెట్టప్రాంతాల్లో గతంలో 20 .60లక్షల విద్యుత్ పంపుసెట్లు ఉంటే ఇప్పుడు 6.30లక్షల పంపుసెట్లు పెరిగాయన్నారు. అయినా ఎక్కడ కూడా కరెంట్ సమస్య తలెత్తడం లేదని చెప్పారు.
రిటైర్ అయి ఏళ్ళు గడుస్తున్నా ట్రాన్స్‌కో సీఎండి ప్రభాకర్‌రావునే ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నిస్తే సమర్థుల సేవలను వినియోగించుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. 82ఏళ్ళు ఉన్న మల్లికార్జున ఖర్గేను ఏఐసిసి అధ్యక్షున్ని చేశారని, 75ఏళ్ళ వయసున్న ప్రభాకర్‌రావును సిఎండిగా కొనసాగించడం తప్పు ఎలా అవుతుందన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోతే వారు చెప్పినట్లుగానే మూడుగంటల కరెంటే గతి అవుతుందని చెప్పారు. కాంగ్రెసోళ్ళ మోసపుమాటలు నమ్మవద్దని రైతులను కోరారు. యాదాద్రి, భదాద్రి పవర్ ఫ్లాంట్లు కమీషన్ల కోసమే నిర్మించారని విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వరంగ సంస్థ అయిన బిహెచ్‌ఈఎల్‌కు కాంట్రా క్టు ఇచ్చామని, కమీషన్లు ఎలా వస్తాయో చెప్పాలన్నారు.