Sunday, December 22, 2024

కాంగ్రెసోళ్ళను తరిమికొట్టాలి

- Advertisement -
- Advertisement -
  • రైతు వ్యతిరేకి రేవంత్‌రెడ్డి
  • ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్‌ః కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే రైతులు తరిమికొట్టాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. రైతులకు వ్యతిరేకంగా టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గురువారం జాతీయ రహదారిపై బిఆర్‌ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ వ్యాఖ్యలు రైతులను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు.

రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను ఆమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలు ఏలా పట్టించుకుంటారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎవరెన్నీ ప్రయత్నాలు చేసిన బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని ఆపలేరన్నారు.

అంతకు ముందు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులతో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అయా మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News