Monday, December 23, 2024

కాంగ్రెస్ వారంటీ అయిపోయింది…ఇక గ్యారంటీలకు అర్థం లేదు: మోడీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రాబోయే కర్నాట అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం లక్షలాది బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ మోడ్‌లో ప్రసంగించారు. ‘ఉచితాలు’(రేవ్డీ) సంస్కృతిని అంతమొందించాలని ఆయన గట్టిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వారెంటీ ముగిసిపోయింది, ఇక దాని గ్యారంటీలకు విలువేముంటుందని మోడీ అన్నారు.

కర్నాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అన్ని గృహాలకు(గృహ జ్యోతి) 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబానికి గృహ లక్ష్మి కింద ఇంటి పెద్ద దిక్కు మహిళకు రూ. 2000 నెలకు సాయం, ప్రతి పట్టభద్రుడైన యువతకు రూ. 3000 నెలకు, డిప్లోమా హోల్డర్లకు (18-25 వయస్సులోని వారికి) నెలకు రూ. 1500 రెండేళ్ల పాటు యువనిధి కింద ఇస్తానని ప్రకటించింది. ఉచితాల కారణంగా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, ఈ పద్ధతిలో ప్రభుత్వాలు నడవకూడదని మోడీ అన్నారు. మనదేశంలో కొన్ని పార్టీలు అవినీతి, అధికారంతో లాభపడుతున్నాయన్నారు. ఇది సాధించడానికి అవి సామ, దాన, దండ, భేదోపాయాలు అనుసరిస్తున్నాయని మోడీ అన్నారు. ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. మే 10న జరగబోయే కర్నాటక ఎన్నికల సందర్భంగా ఆయన బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వారిని ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. మన దేశం అభివృద్ధి చెందాలంటే ‘ఉచితాలు’(రేవ్డీలు) ఉండకూడదన్నారు. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లో ‘రేవ్డీ కల్చర్’ను అనుసరిస్తోందని ఆయన విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News