Monday, December 23, 2024

ఆ నటి బండారం బయట పెడతానంటున్న ఆర్థిక నేరగాడు సుకేశ్

- Advertisement -
- Advertisement -

లెటర్లు రాసి ప్రముఖులను రచ్చకీడుస్తున్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ తాజాగా మరో లెటర్ సంధించాడు. అందులో బాలీవుడ్ నటి, ఒకప్పటి తన క్లోజ్ ఫ్రెండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై ఆరోపణలు చేశాడు. “ఎవరినైతే నేను బాగా చూసుకోవాలనుకున్నానో తనే ఇప్పడు ఎదురు తిరిగింది. కాబట్టి ఇక నాకు మరో దారి లేదు. ఆమె గుట్టు రట్టు చేస్తా. ఇంతకాలం ఆమెకు సంబంధించిన రహస్యాలు దాచి పెట్టా. ఇప్పుడు వాటిని బయటపెడతా. తనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, స్క్రీన్ షాట్లు, చాటింగ్స్ అన్నీ బయటపెడతా” అని సుకేశ్ లెటర్ లో పేర్కొన్నాడు. సుకేశ్ ప్రస్తుతం మాండొలీ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

సుకేశ్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవనీ, అతను తనపై వ్యాఖ్యలు చేయకుండా, లెటర్లు విడుదల చేయకుండా నివారించాలని కోరుతూ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఇది తెలుసుకున్న సుకేశ్.. జాక్వెలిన్ బండారం బయటపెడతానని లెటర్ విడుదల చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News