Saturday, November 23, 2024

సుకేశ్ చంద్రశేఖర్ ఎప్పుడైనా బిజెపిలో చేరొచ్చు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రస్తుతం జైలులో ఉన్న మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఏ రోజైనా బిజెపిలో చేరొచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ విద్యా విధానంపై సుకేశ్ చంద్ర శేఖర్ రెండో లేఖతో వివాదాన్ని మరోసారి రాజేశాడు. “సుకేశ్ చంద్రశేఖర్ బిజెపి భాష నేర్చుకుంటున్నాడు. బిజెపి కూడా కేజ్రీవాల్‌కు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని అంటుండేది. ఇప్పుడు సుకేశ్ చంద్రశేఖర్ కూడా బిజెపి తీరులోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఏ రోజైనా బిజెపిలో చేరొచ్చు” అని కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీ పాఠశాలల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కోసం పిఆర్‌లను ఏర్పాటుచేశానని మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించారు. దానికి మరునాడే కేజ్రీవాల్ దుమ్ముదులిపేశారు. మీడియాకు రాసిన లేఖలో చంద్రశేఖర్ “అమెరికా వార్తల్లో ఢిల్లీ స్కూల్ మోడల్‌ను ప్రమోట్ చేసేందుకు పిఆర్‌లకు 8.5 లక్షల అమెరికా డాలర్లు, 15 శాతం అదనపు కమిషన్ కూడా ఇచ్చాం” అని మీడియాకు రాసిన లేఖలో చంద్రశేఖర్ ఆరోపించారు.
దీనికి ముందు సుకేశ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె. సక్సేనాకు రాసిన లేఖలో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‌కు రూ. 10 కోట్లు ‘ప్రొటెక్షన్ మనీ’ కింద ఇచ్చానని తెలిపాడు. తన రెండు ఉత్తరాల్లో పేర్కొన్న విషయాలు వాస్తవాలని కూడా అతడంటున్నాడు. “నేను పోలిగ్రాఫ్ పరీక్షకు కూడా సిద్ధమే. నా లేఖల్లో పేర్కొన్న ఆరోపణలన్నీ నిజాలే. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సరైన వాళ్లే అయితే పోలిగ్రాఫ్ పరీక్షలకు వెనుకాడకూడదు” అని కూడా అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News