Monday, January 20, 2025

కోకాపేటలో సగర కులస్తుల ఆత్మగౌరవ భవనానికి శంకుస్తాపన

- Advertisement -
- Advertisement -
పాల్గొన్న మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహేందర్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : కోకాపేటలో సగర కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన రూ. 2 కోట్ల నిధులతో 2 ఎకరాల భూమిలో సగరకుల ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులకు మంత్రులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ప్రకాష్ గౌడ్, రాష్ట్ర బిసి కమిషన్ చైర్మెన్ వకులాబరణం కృష్ణమోహన్ రావు, సగర కుల సంఘం రాష్ట్ర నాయకులు మారుతి సాగర్, శేఖర్ సాగర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కుల వృత్తుల ఆత్మ గౌరవం పెరిగే విధంగా వరాలు కురిపిస్తున్నారని అన్నారు.

కుల వృత్తుల పోత్సాహంలో భాగంగా సగర కులస్తులకు అర్హులైన వారందరికి 100 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అద్భుతంగా పేరు గాంచిన ఇంటింటికి మంచినీళ్లు అందించే రాష్ట్ర పథకం మిషన్ భగీరథకు సగర కులస్తుల దైవం భగీరథ పేరు పెట్టి ముఖ్యమంత్రి కెసిఆర్ గౌరవించారని మంత్రి తెలిపారు. ట్యాంక్ బండ్ పై భగీరథుని విగ్రహం కోసం కృషి చేస్తామని, సగర కులస్తులను బిసి – డి నుండి బిసి ఎ గ్రూపులో చేర్చాలన్న డిమాండ్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ కు నివేదిస్తామని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News