Monday, December 23, 2024

ఢిల్లీ డిక్లరేషన్ వెనుక భారీ కసరత్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జీ 20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య కుదిరిన ఢిల్లీ డిక్లరేషన్ పై ఏకాభిప్రాయం సాధించడానికి భారత దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్టు షెర్పా అమితాబ్ కాంత్ ఆదివారం తెలిపారు. దాదాపు 200 గంటల పాటు నిరంతర చర్చలు జరిపినట్టు వెల్లడించారు. అదనపు కార్యదర్శులైన ఈనం గంభీర్, కె. నాగరాజు నాయుడుతో కూడిన దౌత్యవేత్తల బృందం 300ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించినట్టు తెలిపారు. వివాదాస్పద ఉక్రెయిన్ అంశంపై ఇతర దేశాల్లోని తమ సహచరులతో 15 ముసాయిదాలను పంచుకున్నట్టు వివరించారు. వీరందరి కృషి వల్లే జీ 20 సదస్సు తొలిరోజే నేతల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైందన్నారు.

“ మొత్తం జి20 సదస్సు లో అత్యంత సంక్లిష్టమైన భాగం భౌగోళిక రాజకీయాలపై (రష్యాఉక్రెయిన్) ఏకాభిప్రాయం తీసుకురావడం . ఇది 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాల వల్లే సాధ్యమైంది. నాగరాజు నాయుడు, గంభీర్ ఈ విషయంలో తనకు ఎంతో సహకరించారు” అని అమితాబ్ కాంత్ చెప్పారు. జీ20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్ శనివారం పెద్ద విజయాన్ని నమోదు చేసింది.

పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో తలెత్తిన పీటముడిని చాకచక్యంగా పరిష్కరించగలిగింది. సంయుక్త ప్రకటనలో సంబంధిత పేరాను సవరించడం ద్వారా అన్ని దేశాల మద్దతును గెల్చుకోగలిగింది. ఢిల్లీలో శిఖరాగ్ర సదస్సులో అధ్యక్ష స్థానంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈమేరకు ఒక అధికారిక ప్రకటన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News